గత జన్మ గురించి చెప్పి ఆశ్చర్యపరుస్తున్న వృద్ధుడు

మనం గత జన్మలకు సంబంధించిన ఉదంతాల గురించి చాలానే వినివుంటాం. అయితే ఇప్పుడు వినబోయే ఈ ఉదంతం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 61 ఏళ్ల ఒక వ్యక్తి తన గత జన్మ విశేషాల గురించి పలు వివరాలు తెలిపాడు. తాను మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పైలెట్‌గా పనిచేశానని, ఆ యుద్ధంలోనే చనిపోయానని తెలిపాడు. తనకు ఆ విషయాలన్నీ గుర్తున్నాయని, తనను ఖననం చేసిన ప్రాంతం కూడా తనకు తెలుసని, దానిని పలుమార్లు సందర్శించానని వివరించారు. 61 ఏళ్ల స్టీవ్ ముల్గిన్ 1961లో మాంచెస్టర్ లో జన్మించారు. నార్త్ వేల్స్ లైవ్ రిపోర్టును అనుసరించి ముగ్లిన్‌కు 1903నాటి తన గత జన్మ గుర్తుకువచ్చింది. దీంతో ముగ్లిన్ తాను సిడ్నీలో పెరిగానని, ఆ విషయాలన్నీ తనకు బాగా గుర్తున్నాయని తెలిపారు. 24 ఏళ్ల వయసులో మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించానని ముగ్లిన్ తెలిపాడు. అప్పట్లో తాను ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పనిచేశానన్నారు. 1917లో యుద్ధం జరుగుతున్న సమయంలో విమానంలో ఇంధనం నింపే సమయంలో తనను చంపేశారని ముగ్లిన్ తెలిపారు. తాను గత జన్మలో చిన్నప్పటి నుంచి ఆర్మీలో పనిచేయాలని అనుకునేవాడినన్నారు. ఆ నాటి రోజుల్లో తిరిగిన ప్రాంతాలన్నీ తనకు గుర్తుకొచ్చాయన్నారు. తాను మృతి చెందిన అనంతరం తనను ఖననం చేసిన ప్రాంతం తనకు గుర్తుందని కూడా ముగ్లిన్ తెలిపారు.

Prakaash

7/26/20251 min read

Healing

Experience holistic healing rooted in ancient wisdom.

Contact

eNQUIRY

37pach@gmail.com

+919281430037

© 2025. All rights reserved.